ఎస్ఎస్‌సీ సీజీఎల్ ఫైన‌ల్ కీ 1 y ago

featured-image

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్ (ఎస్ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేష‌న్ లెవ‌ల్ టైర్‌-2 (సీజీఎల్) ప‌రీక్ష‌-2024 తుది కీతో పాటు రెస్పాన్స్‌షీట్‌ను విడుద‌ల చేసింది. ఇటీవ‌లే తుది ఫ‌లితాలు వెల్ల‌డించింది. ఈ ప‌రీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖ‌ల్లోని గ్రూప్‌-బి, గ్రూప్‌-సి విభాగాల్లోని 18,174 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. టైర్‌-2 ప‌రీక్ష‌లు జ‌న‌వ‌రి 18, 19, 20, 31 తేదీల్లో జ‌రిగాయి. అభ్య‌ర్ధులు వ్య‌క్తిగ‌త లాగిన్ ఐడీతో ఫైన‌ల్ కీతో పాటు రెస్పాన్స్‌షీట్‌ను పొంద‌వ‌చ్చు. ఈ ఫ‌లితాల‌ను ఎస్ఎస్‌సీ మార్చి 18 నుంచి ఏప్రిల్ 17 వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచ‌నున్న‌ట్లు తెలిపింది. గ‌త ఏడాది టైర్‌-1 (సీబీటి-1) ప‌రీక్ష‌లు సెప్టెంబ‌ర్ 9వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD